గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గంలో తెనాలి, కొల్లిపొర మండలాలున్నాయి. 262998 మంది ఓటర్లు ఉన్నారు. ఒకప్పుడు ఆంధ్రా ప్యారిస్‌గా గుర్తింపు పొందిన తెనాలి, నేడు కనీస సదుపాయాలు లేక కునారిల్లుతోంది.
1952, 1955, 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆలపాటి వెంకటరామయ్య హ్యాట్రిక్ సాధించారు.1967, 1972లో స్వతంత్ర అభ్యర్థిగా దొడ్డపనేని ఇందిర గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి ఇందిర మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 1983, 1985లో తెనాలి నుంచి టీడీపీ అభ్యర్థిగా అన్నాబత్తుని సత్యనారాయణ గెలుపొందారు.
1989లో కాంగ్రెస్ అభ్యర్థి నాదెండ్ల భాస్కరరావు విజయం సాధించారు. 1994లో టీడీపీ అభ్యర్థి రావి రవీంధ్రనాథ్, 1999లో టీడీపీ అభ్యర్థి గోగినేని ఉమ గెలుపు జెండా రెపరెపలాడించారు.2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వరుసగా రెండు సార్లు విజయాన్ని అందుకున్నారు. 2014లో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, 2019లో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గెలుపు జెండా ఎగురవేశారు.
ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ బరిలో నిలిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలవడం నాదెండ్ల మనోహర్‌కు కలసివచ్చే అంశం. కూటమి బలం, సామాజికవర్గం అండతో నాదెండ్ల మనోహర్ విజయం సాధించవచ్చని తెలుస్తోంది.