వేమూరు(
ఎస్సీ) శాసనసభ నియోజకవర్గాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ, టీడీపీలు తీవ్రంగా
చెమటోడుస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసిన మేరుగ
నాగార్జున విజయం సాధించారు. అంతేకాకుండా జగన్ కేబినెట్ లో మంత్రిగానూ కొనసాగుతున్నారు.
అయితే ఆయన ఈసారి సంతనూతలపాడు నుంచి పోటీ
చేస్తుండగా, ఫ్యాన్ గుర్తుపై వరికూటి అశోక్ బాబు బరిలో ఉన్నారు.
2014లో
వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ తరఫున పోటీ చేసిన నక్కా ఆనందబాబు గెలవగా
2019లో పరిస్థితి తారుమారైంది. నాగార్జున చేతిలో ఆనంద్ బాబు ఓడారు.
2009
లో ఈ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలోదిగిన కత్తి పద్మారావు,
మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
ప్రస్తుతం
టీడీపీ నుంచి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బరిలో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో
ఆనందబాబు కూడా కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
ప్రస్తుతం ఆనందబాబు వెర్సెస్ అశోక్
బాబుల మధ్య పోటీ నియోజకవర్గంలో రసవత్తరంగా మారింది.
2019లో
సైకిల్ గుర్తుపై పోటీ చేసిన నక్కా ఆనందబాబు సుమారు పదివేల ఓట్ల తేడాతో మేరుగ నాగార్జున(వైసీపీ) చేతిలో ఓడారు. జనసేన
తరఫున పోటీ చేసిన భరత్ భూషణ్ కు సుమారు 13 వేల ఓట్లు పడ్డాయి. అయితే సారి కూటమి నేపథ్యంలో
జనసైనికులు, కమలనాథుల మద్దతుతో తన విజయం సునాయాసమని నక్కా ఆనందబాబు
లెక్కలేసుకుంటున్నారు.
వైసీపీ అభ్యర్థి కూడా గెలుపు ధీమా ప్రదర్శిస్తున్నారు. తమ అధినేత వైఎస్ జగన్ చరిష్మాతో
తన గెలుపు ఖాయం అంటున్నారు. అమావస్యకు పౌర్ణమికి నియోజకవర్గంలో పర్యటించే నక్కా
ఆనంద్ బాబుకు ప్రజా మద్దతు లేదంటున్నారు. పెత్తందార్లతో మాత్రమే ఆనందబాబు
మాట్లాడుతారంటూ ఆరోపిస్తున్నారు.