గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎస్వీ రిజర్వుడు నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. గుంటూరు రూరల్, కాకుమాను, ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాలు ఈ నియోజకవర్గంలో చేర్చారు. ఇక్కడ మొత్తం 250247 మంది ఓటర్లున్నారు.
1952లో కాంగ్రెస్ నుంచి తమ్మా కోటంరెడ్డి, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎంసీ నాగయ్య గెలుపొందారు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థి పీటర్ పాల్, 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా కె లక్ష్మీనారాయణరెడ్డి విజయం సాధించారు.1978 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గం జనరల్ చేశారు. 1983, 1985, 1989, 1994, 1999లో వరుసగా ఐదుసార్లు జనరల్ అభ్యర్థి మాకినేని పెదరత్తయ్య గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి రావి వెంకట రమణ, 2008లో కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి సుచరిత విజయం సాధించారు. తరువాత ఆమె వైసీపీలో చేరి 2012 ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014లో టీడీపీ నుంచి రావెల కిషోర్ బాబు గెలిచి క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2019లో మరోసారి వైసీపీ నుంచి మేకతోటి సుచరిత గెలిచి హోం, ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు.
తాజాగా జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి బాలసాని కిరణ్ కుమార్, టీడీపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి బి. రామాంజనేయులు, కాంగ్రెస్ నుంచి కొరివి వినయ్ కుమార్ బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి నాన్ లోకల్ కావడం వైసీపీకి కలసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు