ఆంధ్రప్రదేశ్
లోని 25 లోక్సభ స్థానాల్లో బాపట్ల నియోజకవర్గం ఒకటి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన
బాపట్ల పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు
ఉన్నాయి. ఇందులో రెండు శాసనసభ స్థానాలు కూడా ఎస్సీ రిజర్వుడు కావడం గమనార్హం.
ప్రస్తుత
ఈ లోక్సభ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీగా బ్యాలెట్ పోరు
జరుగుతోంది.
వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నందిగం సురేశ్ పోటీ లో ఉండగా,
టీడీపీ తరఫున బీజేపీ, జనసేన మద్దతుతో మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ బరిలో ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేతగా ఉన్న కృష్ణప్రసాద్ వరంగల్ లోక్
సభకు పోటీ చేయాలని భావించారు. కానీ అనుహ్యంగా ఆయన బాపట్ల బరిలో దిగారు. తీవ్ర
తర్జనభర్జన అనంతరం మూడో జాబితాలో బాపట్ల అభ్యర్థిని టీడీపీ ప్రకటించింది.
సిట్టింగ్
ఎంపీగా ఉన్న నందిగం సురేశ్, వైసీపీ కోర్ కమిటీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ఆయన మూడు
రాజధానులకు అనుకూలంగా అమరావతి ప్రాంతంలో శిబిరం కూడా నడిపారు. అమరావతి రాజధాని ప్రకటన సమయంలో ఆయన పై పోలీసు కేసు కూడా
నమోదైంది. తనపై తప్పుడు కేసు పెట్టి టీడీపీ ప్రభుత్వం వేధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో
ఈ సాన్థం నుంచి రాజకీయ, చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు విజయం సాధించారు. 2009లో
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నుంచి ఎస్సీ రిజర్వుడుగా మారింది.
దుగ్గుబాటి
వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందరేశ్వరి, దగ్గుబాటి రామానాయుడు ఈ స్థానం నుంచి
విజయం సాధించారు. అలాగే మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి కూడా ఈ స్థానంలో పోటీ
చేసి గెలిచారు. టీడీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా విజయం సాధించారు.
2009లో హస్తం గుర్తుపై గెలిచిన పనబాక లక్ష్మీ,
కేంద్రమంత్రిగాను పనిచేశారు. 2014లో మాల్యాద్రి శ్రీరాం సైకిల్ గుర్తుపై పోటీ చేసి
గెలిచారు. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి నందిగం సురేశ్ చేతిలో మాల్యాద్రి పరాజయం
చెందారు.
బాపట్ల
లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు… వేమూరు (ఎస్సీ), రేపల్లె,
బాపట్ల, పరుచూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు (ఎస్సీ).