వేసవిలో అయోధ్యకు వచ్చే భక్తుల కోసం రామ మందిర నిర్మాణ
ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వడదెబ్బ బారిన పడుతున్న భక్తులకు తక్షణమే
వైద్య సేవలు అందించేందుకు గాను పది పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.
దర్శనం సమయంలో భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు
తలెత్తినా ఈ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చు.
ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటంతో భక్తుల సౌకర్యార్థం జన్మభూమి పాద్ నుంచి
రామాలయం వరకు వివిధ ప్రాంతాల్లో వసతి కల్పిస్తున్నారు.
రామజన్మభూమి మార్గంలో ప్రధాన ద్వారం
వద్ద ఏర్పాటు చేసిన వసతి కేంద్రంలో 1000 మంది భక్తులు విశ్రాంతి తీసుకోవచ్చు. కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి
సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఇక్కడే 10 పడకల మినీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.
మూడు రోజుల క్రితం రామజన్మభూమి
కాంప్లెక్స్‌లో ఇద్దరు భక్తులు వడదెబ్బ బారినపడ్డారు. దీంతో ఆలయ ట్రస్ట్ పలు
జాగ్రత్తలు తీసుకుంటోంది. అంబులెన్స్
సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.