‘ముందు రాయ్‌బరేలీలో గెలవండి’ అంటూ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ని ఉద్దేశించి చేసిన కామెంట్ పై చెస్ దిగ్గజం
గ్యారీ కాస్పరోవ్ వివరణ ఇచ్చారు. రాహుల్ విషయంలో జోక్ మాత్రమే చేశానని, సీరియస్
గా తీసుకోవద్దు అని కోరారు.
ఇటీవల ఎన్నికల ప్రచారానికి వెళ్ళడానికి
ముందు రాహుల్ గాంధీ తన మొబైల్ లో చెస్ ఆడాడు. ఆ సందర్భంగా గ్యారీ కాస్పరోవ్ తన
అభిమాన చెస్ క్రీడాకారుడని పేర్కొన్న రాహుల్ అతనొక నాన్ లీనియర్ థింకర్ అని అన్నారు.
రాజకీయాలకు, చదరంగానికి
దగ్గరి సంబంధాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆటపై ఒక్కసారి దృష్టి
సారిస్తే ప్రత్యర్థి పావులు సైతం మన సొంతమవుతాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చెస్
ప్లేయర్ అంటూ కితాబిచ్చుకున్నారు.
రాహుల్ కామెంట్ పై సోషల్ మీడియాలో ఓ యూజర్ వ్యంగ్యంగా స్పందిస్తూ.. ‘‘చెస్
దిగ్గజాలు కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్ చాలా తొందరగా ఆట నుంచి
రిటైర్ అయ్యారని చురక వేశాడు. ఈ కామెంట్ పై స్పందించిన కాస్పరోవ్, ఈ క్రమంలోనే
‘‘ముందు రాయ్‌బరేలీలో గెలవాలి’’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇప్పుడది వైరల్ కావడంతో తాను
సరదాగా పోస్టు చేశానని సీరియస్ గా తీసుకోవద్చు అని వివరణ ఇచ్చారు.
రష్యాకు చెందిన 61
ఏళ్ల కాస్పరోవ్ చెస్ లో ఎన్నో ఘనతలు సాధించారు. 2005లో ఆటకు వీడ్కోలు పలికారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయాలపై విమర్శలు
గుప్పిస్తుంటారు. త కొన్నేళ్ల క్రితం తన దేశం నుంచి పారిపోయి క్రొయేషియాలో
ఉంటున్నారు. రష్యా ప్రకటించిన ఉగ్రవాదుల అతివాదుల జాబితాలో కాస్పరోవ్ పేరు కూడా ఉంది.