వేసవి
తాపానికి తోడు వడగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఉడికిపోతుంది. రాష్ర వ్యాప్తంగా ఎండతీవ్రతకు
తోడు వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. 59 మండలాల పరిధిలో అతి తీవ్ర వడగాలులు
వీస్తున్నాయి.
శ్రీకాకుళం
జిల్లాలోని 12 మండలాలు, విజయనగరం జిల్లాలో 23 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో
14 మండలాల పరిధిలో, అనకాపల్లి పరిధిలోని 8
మండలాల్లో తీవ్ర వడగాలులు, ఈ రోజు, రేపు కూడా కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల
నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
అమరావతిలోని
భారత వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరకోస్తా, యానాం, దక్షిణ కోస్తా,
రాయలసీమ లో వడగాలులు కొనసాగుతాయని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరింది.
మే
7న దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, యానం
పరిధిలో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో
గాలులు వీస్తూ వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు.
శుక్రవారం(నిన్న) 63 మండలాల పరిధిలో తీవ్రమైన వడగాలులు వీచాయి.
నంద్యాలలో అత్యధికంగా 46.3 డిగ్రీల
ఉష్ణోగ్రత నమోదు కాగా, కడపలో 46.2 డిగ్రీలు, కర్నూలులో 45.9 డిగ్రీలు, జంగమహేశ్వరపురంలో
45.2 డిగ్రీలు, అనంతపురంలో 45.2 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది.
అయితే ఉత్తరాంధ్రలో మాత్రం సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో వాన పడింది. దీంతో
వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.