పొరుగు దేశం నేపాల్ కొత్త వివాదానికి తెర లేపింది. ఇటీవల కొత్తగా విడుదల చేసిన కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాల పటం ముద్రించింది. నేపాల్, భారత్ మధ్య వివాదాస్పదంగా ఉన్న లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ భూభాగాల పటాన్ని కొత్త రూ.100 నోటుపై ముద్రించడం వివాదానికి దారితీసింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఏకపక్ష చర్యగా పేర్కొంది. నేపాల్ తీసుకున్న చర్య ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది.
పాత రూ.100 నోటు స్థానంలో, కొత్త రూ.100 నోటుపై కొత్తపటం ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆదేశ సమాచార, ప్రసారశాఖ మంత్రి రేఖశర్మ వెల్లడించారు. ఇందుకు సంబంధించి 2020లో నేపాల్ రాజ్యాంగ సవరణ కూడా చేసింది. వందనోటుపై ముద్రించినవి, వ్యూహాత్మక కీలక ప్రాంతాలు కావడం విశేషం. పశ్చిమబెంగాల్, బిహార్, సిక్కిం, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ 1850 కి.మీ సరిహద్దు కలిగిఉంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు