Narasaraopet
Parliamentary Constituency Profile
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట
లోక్‌సభా నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఆ పార్లమెంటరీ స్థానంలో ఏడు శాసనసభా
స్థానాలు ఉన్నాయి. అవి పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి,
వినుకొండ, గురజాల, మాచర్ల.
నరసరావుపేట ఎంపీ సీటులో 1952 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి బోణీ చేసారు. తర్వాత
వరుసగా 1967, 1971, 1977, 1980 నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
1984లో తెలుగుదేశం గెలిచింది. మళ్ళీ 1989, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి
మోగించింది. 1996లో తెలుగుదేశం ఉనికి చాటుకుంది. 1998, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్
నుంచి వరుసగా కొణిజేటి రోశయ్య, నేదురుమల్లి జనార్దనరెడ్డి, మేకపాటి రాజమోహన్
రెడ్డి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2009, 2014లో తెలుగుదేశం అభ్యర్ధులు గెలిచారు.
2019 ఎంపీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి
తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం అభ్యర్ధి రాయపాటి సాంబశివరావు మీద విజయం
సాధించారు. 2024 నాటికి రాయలుకు వైసీపీ మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయమని
ఆదేశించింది. దానికి అంగీకరించని రాయలు పార్టీ మారి తెలుగుదేశంలో చేరారు.
ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి తరఫున మాజీ
మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం
అభ్యర్ధిగా లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలోకి దిగారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్
అభ్యర్ధిగా గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ నిలబడ్డారు.