Macharla
Assembly Constituency Profile
పల్నాడు జిల్లాలోని మాచర్ల
నియోజకవర్గం 1955లో ఏర్పడింది. మాచర్ల శాసనసభా స్థానం పరిధిలో ఐదు మండలాలు
ఉన్నాయి. అవి మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి.
మాచర్లలో 1955లో సిపిఐ
బోణీ కొట్టింది. 1972లో ఒకసారి స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1962, 1967, 1978,
1985 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1983, 1989, 1994, 1999లో
తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. మళ్ళీ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
కనబరిచింది.
2004లో కాంగ్రెస్
అభ్యర్ధి పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఇప్పటివరకూ పిన్నెల్లి
రామకృష్ణారెడ్డే మాచర్లను సొంతం చేసుకున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2012,
2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నుంచి వరుసగా విజయాలు సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్సిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా
ఐదోసారి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్ధిగా ఎన్డిఎ కూటమి నుంచి తెలుగుదేశం
తరఫున జూలకంటి బ్రహ్మానందరెడ్డి బరిలో నిలిచారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా యరమల రామచంద్రారెడ్డి పోటీపడుతున్నారు.