Gurazala
Assembly Constituency Profile
పల్నాడు జిల్లాలోని
గురజాల అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఆ శాసనసభా స్థానం పరిధిలో నాలుగు
మండలాలు ఉన్నాయి. అవి గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ళ, మాచవరం.
గురజాల నియోజకవర్గంలో
1955 ఎన్నికల్లో కృషికార్ లోక్ పార్టీ గెలిచింది. 1962, 1967, 1978లో కాంగ్రెస్
పార్టీ గెలిచింది. మధ్యలో 1972లో సిపిఐ ఉనికి చాటుకుంది. 1983, 1985 ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీ రంగప్రవేశం చేసింది. 1989, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్
జెండా ఎగరేసింది. 1994, 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. 2019
ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి కాసు మహేష్ రెడ్డి, అప్పటికి మూడుసార్లు
ఎమ్మెల్యే అయిన తెలుగుదేశం ప్రత్యర్ధి యరపతినేని శ్రీనివాసరావును ఓడించారు.
2024లో మళ్ళీ
వాళ్ళిద్దరే తలపడుతున్నారు. అధికార వైఎస్ఆర్‌సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు
మహేష్ రెడ్డికే మళ్ళీ టికెట్ ఇచ్చింది. ప్రతిపక్ష తెలుగుదేశం కూడా ఎన్‌డిఎ కూటమి
తరఫున తమ అభ్యర్ధిగా యరపతిని శ్రీనివాసరావునే పోటీ పెట్టింది. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా తియ్యగూర యలమంద రెడ్డి రంగంలో ఉన్నారు.