Vinukonda
Assembly Constituency Profile
పల్నాడు జిల్లాలోని
వినుకొండ శాసనసభా స్థానం 1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో ఐదు మండలాలు
ఉన్నాయి. అవి ఈపూరు, వినుకొండ, నూజెండ్ల, శావల్యాపురం, బొల్లాపల్లె.
వినుకొండలో 1952, 1962,
1985 ఎన్నికల్లో సిపిఐ గెలిచింది. 1955, 1967, 1972, 1989, 2004లో కాంగ్రెస్
గెలిచింది. 1978, 1983, 1994ల్లో స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు. విచిత్రం ఏంటంటే
తెలుగుదేశం పార్టీ స్థాపించాక జరిగిన 1983, 1985 ఎన్నికలు రెండింట్లోనూ ఆ పార్టీ
వినుకొండలో బోణీ చేయలేకపోయింది. ఆ పార్టీ 1994, 2009, 2014 ఎన్నికల్లో గెలుపు దక్కించుకోగలిగింది.
2019లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి బొల్లా బ్రహ్మనాయుడు తెలుగుదేశం ప్రత్యర్ధి గోనుగుంట్ల
వెంకట సీతారామాంజనేయులు (జివి ఆంజనేయులు) మీద విజయం సాధించారు.
ఇప్పుడు 2024లో కూడా వారిద్దరి
మధ్యనే పోరు జరగనుంది. అధికార వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
నిలబడ్డారు. ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి జివి ఆంజనేయులు పోటీలోకి
దిగారు. ఇండీ కూటమి తరఫున చెన్నా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు.