Sattenapalli
Assembly Constituency Profile
ప్రఖ్యాత గాంధేయవాది
వావిలాల గోపాలకృష్ణయ్యను శాసనసభకు పంపించిన నియోజకవర్గం సత్తెనపల్లి. ప్రస్తుతం పల్నాడు
జిల్లాలో ఉన్న ఆ శాసనసభా స్థానం 1951లో ఏర్పడింది. దాని పరిధిలో నాలుగు మండలాలు
ఉన్నాయి. అవి సత్తెనపల్లి, రాజుపాలెం, నెకరికల్లు, ముప్పాళ్ళ.
సత్తెనపల్లిలో 1952,
1955, 1962, 1967లో వరుసగా నాలుగుసార్లు వావిలాల గోపాలకృష్ణయ్య ఎన్నికయ్యారు.
అందులో 1955లో సిపిఐ తరఫున, మిగతాసార్లు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయడం గమనార్హం.
1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1983లో తెలుగుదేశం తొలిసారి గెలిచింది.
1985లో సిపిఐ, 1989లో కాంగ్రెస్, 1994లో సిపిఐ, 1999లో తెలుగుదేశం గెలిచాయి. 2004,
2009లో కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో
జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున కోడెల శివప్రసాదరావు నరసరావుపేట నుంచి వచ్చి
వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి అంబటి రాంబాబుపై పోటీచేసి 924 ఓట్ల నామమాత్రపు మెజారిటీతో
గెలిచారు. 2019లో అంబటి రాంబాబు కోడెలను 20వేలకు పైగా మెజారిటీతో ఓడించి ప్రతీకారం
తీర్చుకున్నారు.
2024 ఎన్నికల్లో అధికార
వైఎస్ఆర్‌సిపి తరఫున అంబటి రాంబాబు వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎఏ
కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ
బరిలో ఉన్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా చుక్కా చంద్రపాల్
నిలబడ్డారు.