Narasaraopet
Assembly Constituency Profile
పల్నాడు జిల్లా నరసరావుపేట
అంటే కోడెల శివప్రసాదరావు గుర్తుకొస్తారు. టిడిపి అభ్యర్ధిగా ఐదుసార్లు వరుసగా
గెలిచిన రికార్డు ఆయనది. గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సిపి తరఫున గెలిచిన
డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు.
నరసరావుపేట శాసనసభా
నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ అసెంబ్లీ స్థానం పరిధిలో రెండు మండలాలు ఉన్నాయి. అవి
రొంపిచెర్ల, నరసరావుపేట.
నరసరావుపేటలో 1952లో కిసాన్
మజ్దూర్ ప్రజాపార్టీ నుంచి, 1955లో కాంగ్రెస్ నుంచి నల్లపాటి వెంకట్రామయ్య
గెలిచారు. 1962, 1967, 1972, 1978 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులే
విజయాలు సాధించారు. 1983లో తెలుగుదేశం అభ్యర్ధిగా కోడెల శివప్రసాదరావు రంగప్రవేశం
చేసారు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. 2004లో
మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెసే
గెలుపు కైవసం చేసుకుంది.
2014 ఎన్నికల్లో
వైఎస్ఆర్సిపి తరఫున డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి
నలబోతు వెంకటరావు మీద గెలిచారు. 2019లో కూడా ఆయన తెలుగుదేశం అభ్యర్ధి డాక్టర్
చదలవాడ అరవింద్ బాబును ఓడించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్సిపి తమ సిటింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మూడోసారి బరిలోకి
దిగారు. టిడిపి కూడా అరవింద్ బాబునే ఎన్డిఎ కూటమి నుంచి పోటీకి పెట్టింది. ఇండీ
కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా షేక్ మహబూబ్ బాషా నిలబడ్డారు.