Chilakaluripet
Assembly Constituency Profile
పల్నాడు జిల్లాలోని
చిలకలూరిపేట నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ శాసనసభా స్థానం పరిధిలో మూడు మండలాలు
ఉన్నాయి. అవి నాదెండ్ల, చిలకలూరిపేట, యెడ్లపాడు.
చిలకలూరిపేట నియోజకవర్గం
ప్రధాన రాజకీయ పార్టీలు అన్నింటినీ దాదాపు సమానంగా ఆదరించింది. అక్కడ 1951లో సిపిఐ,
1967లో స్వతంత్ర పార్టీ గెలిచాయి. 1972, 1978లో కాంగ్రెస్ విజయం సాధించింది.
1983లో తెలుగుదేశం అరంగేట్రం చేసింది. 1985, 1994లో కాంగ్రెస్ మళ్ళీ ఉనికి
చాటుకుంది. 1989, 1999లో తెలుగుదేశం జోరు చూపించింది. 2004లో స్వతంత్ర అభ్యర్ధి
విజయం సాధించారు. 1999లో గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు 2009, 2014లో వరుసగా
టిడిపి అభ్యర్ధిగా పైచేయి సాధించారు. ఆయనకు 2019లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి విడదల
రజిని బ్రేక్ వేసారు.
ఇప్పటికి ఐదుసార్లు పోటీ
చేసి మూడుసార్లు గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు 2024 ఎన్నికల్లో ఎన్డిఎ కూటమి
తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా ఆరోసారి బరిలోకి దిగారు. అధికార వైఎస్ఆర్సిపి ఈసారి
ఆయనపై ప్రత్యర్ధిని మార్చింది. కావటి శివనాగ మనోహర్నాయుడును నిలబెట్టింది. ఇక
ఇండీ కూటమి తరఫున మద్దుల రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు.