Pedakurapadu
Assembly Constituency Profile
పల్నాడు జిల్లాలోని
పెదకూరపాడు శాసనసభా నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఆ అసెంబ్లీ స్థానం పరిధిలో ఐదు
మండలాలు ఉన్నాయి. అవి బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు.
పెదకూరపాడు
నియోజకవర్గంలో 1955 ఎన్నికల్లో కృషికార్ లోక్ పార్టీ తరఫున గణపా రామస్వామి రెడ్డి
గెలిచారు. ఆయనే కాంగ్రెస్‌లో చేరి 1962, 1967 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయనే
1978లో జనతా పార్టీ నుంచి శాసనసభ మెట్లు ఎక్కారు. 1972లో కూడా కాంగ్రెస్ అభ్యర్ధి
ఫాతిమున్నీసా బేగం గెలిచారు. ఇక 1983, 1985లో తెలుగుదేశం పార్టీ గెలుపు
దక్కించుకుంది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్ధిగా కన్నా లక్ష్మీనారాయణ 1989, 1994,
1999, 2004 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి
నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ గెలుపు సొంతం చేసుకున్నారు. 2019లో కొమ్మాలపాటి శ్రీధర్‌కు
వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి నంబూరు శంకరరావు చెక్ పెట్టారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును బరిలోకి దింపింది. ఎన్‌డిఎ
కూటమి నుంచి తెలుగుదేశం తరఫున భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి
కాంగ్రెస్ అభ్యర్ధిగా పమిడి నాగేశ్వరరావు రంగంలో ఉన్నారు.