లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో భారీ నష్టాలతో ముగిసింది. ఇవాళ ఉదయం 400 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి 732 పాయింట్ల నష్టంతో 73878 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 1100 పాయింట్లుపైగా నష్టపోయింది. చివర్లో కొంత కోలుకుంది. నిఫ్టీ 191 పాయింట్ల నష్టంతో 22456 వద్ద ముగిసింది. రూపాయి మరింత దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.43 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, మారుతీ షేర్లు నష్టపోయాయి.అమెరికాలో ద్రవ్యోల్భణం ఆందోళనకర స్థాయిలో పెరగడం మార్కెట్లపై ప్రభావం చూపింది.