భానుడి ప్రతాపానికి తోడు వడగాలులతో
జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నారులు,
వృద్ధులు వడగాడ్పులతో తీవ్ర
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరో
నాలుగు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు లో వడగాల్పుల
ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
తూర్పు
ప్రాంతంలో వడగాలులు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త
డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు.
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో
తీవ్ర వడగాలులు కొనసాగనున్నాయి.
అరుణాచల్
ప్రదేశ్ తో పాటు అసోం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాంలో రెండు రోజుల
తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు
అంచనా వేశారు.
కర్ణాటక రాజధాని
బెంగళూరు లో ఈ రోజు వర్షం పడింది. దీంతో సిలికాన్ సిటీ వర్షంతో తడిసిముద్దైంది.
కొన్ని నెలలుగా నీళ్ళు లేక అల్లాడుతున్న బెంగళూరు వాసులకు కొంత ఉపశమనం
లభించినట్లైంది.