రాయబరేలి
నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేయకపోవడం పై పలు రకాల అభిప్రాయాలు
వెల్లడవుతున్నాయి. తాజాగా ఆ పార్టీ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం స్పందించారు.
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం రాహుల్ కు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు.
కుటుంబంలో, పార్టీలో ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా
పెద్ద కుట్ర జరుగుతుందన్నారు.రాహుల్ గాంధీకి అమేథి నుంచి పోటీ చేయడం ఇష్టం
లేకపోతే వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయాలని సూచించారు.
ప్రియాంక
విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా
స్పందించింది. భవిష్యత్తులో ఆమె పోటీ చేస్తారని పేర్కొంది.
ప్రధాని
నరేంద్ర మోదీ చెబుతున్న అసత్యాలను తిప్పికొట్టడంలో ప్రియాంక గాంధీ నిమగ్నమయ్యారని.. విస్తృతంగా
ఎన్నికల ప్రచారం పాల్గొంటున్నారని పేర్కొంది. ఏదైనా ఉప ఎన్నికలో ఆమె పోటీ చేసి
పార్లమెంటులో అడుగుపెడతారని కాంగ్రెస్
పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ వెల్లడించారు.