మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో గురువారం వైసీపీ నేతలు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనసేన నేత కర్రి మహేష్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో పేర్ని కిట్టు సహా ఆరుగురిపై మర్డర్ కేసు నమోదు చేశారు. ఏ1గా పేర్ని కిట్టుకు చేర్చారు.
కర్రి మహేష్‌పై దాడిచేసి తీవ్రంగా తాయపరిచిన కేసులో పేర్ని కిట్టు సహా చింతకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, ధనబాబు, లంకే రమేశ్, శీనయ్యలను నిందితులుగా చేర్చారు. వీరిలో కిట్టు మినహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. బాధితుడు కర్రి మహేష్‌పై కూడా కేసు నమోదు చేశారు. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కులం పేరుతో తిట్టాడంటూ వైసీపీ నేత నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహేష్‌పై కేసు నమోదు చేశారు.