కాంగ్రెస్ అగ్రనేత వాయనాడ్ తో పాటు రాయబరేలీలో పోటీ చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘భయపడకు, పారిపోకు’ అంటూ రాహుల్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.పశ్చిమబెంగాల్ లోని బర్ధమాన్ -దుర్గాపూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ,వాయనాడ్‌లో ఓటమి భయంతో షెహజాదే ( రాహుల్ గాంధీ) మరో చోట పోటీ చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ కు గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి తక్కువ స్థానాలను మాత్రమే గెలుస్తుందన్నారు.కేవలం దేశాన్ని విభజించేందుకే కాంగ్రెస్ ఎన్నికలను ఉపయోగించుకుంటుందన్నారు.తల్లీకొడుకులు(సోనియా-రాహుల్ ) ఇద్దరూ తమ స్థానాలు వదలివేసి పారిపోయారన్న ప్రధాని మోదీ, వయనాడ్‌లో కూడా రాహుల్ ఓటమి ఖరారైందన్నారు.
పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిందని ఆరోపించిన మోదీ, జై శ్రీరామ్ నినాదం కూడా వారికి కోపం తెప్పించేలా చేసిందన్నారు. సందేశ్ ఖలీలోని దళితులపై జరిగన దౌర్జన్యాలను టీఎంసి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దోషి షాజహాన్ ను కాపాడేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుందన్నారు.