కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న లైంగిక వేధింపుల అంశంపై హెచ్డి రేవణ్ణ, ప్రజ్వల్‌పై కేసులు నమోదు చేశారు. మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌పై అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడటం, దాడికి దిగడం, అశ్లీల చిత్రాలు తీసి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలాంటి నేరాలపై కేసులు నమోదు చేశారు.
హెచ్డి రేవణ్ణ ఇంట్లో, ఫాంహౌస్‌లో రాజు, అతని తల్లి ఆరేళ్లు పనిచేశారు.ఆ సమయంలో రాజు తల్లిని లైంగికంగా వేధించారని, విషయం బయటకు చెబితే వారిపైనే కేసులు పెడతామని రేవణ్ణ, ప్రజ్వల్ బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలు నమోదయ్యాయి. ఇటీవల రాజు తల్లికి చెందిన వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. దీంతో కర్ణాటక రాజకీయాల్లో లైంగిక ఆరోపణలు సంచలనంగా మారాయి.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న హెచ్డి రేవణ్ణ, ప్రజ్వల్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పోలీసుల వద్ద హాజరుకాకుంటే అరెస్ట్ చేసి విచారిస్తారని కర్ణాటక హోం మంత్రి డాక్టర్ పరమేశ్వర్ మీడియాకు వెల్లడించారు. గురువారం హెచ్డి రేవణ్ణ, ప్రజ్వల్ విచారణకు హాజరు కాలేదు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు