వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివేకా మర్డర్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఉదయ్‌కుమార్‌రెడ్డి, సునీల్ యాదవ్‌లకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ అప్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
వివేకాహత్య కేసులో సునీల్ యాదవ్ పొల్గొన్నట్లు సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వివేకాహత్య జరిగిన సమయంలో సునీల్ యాదవ్, అక్కడే ఉన్నట్లు గూగుల్ టేకవుట్ ద్వారా వెల్లడైందని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. హత్యలొ పాల్గొన్నారనడానికి అది ఒక్కటే ఆధారం కాదని కూడా సీబీఐ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అప్రూవర్‌గా మారిన దస్తగిరి, వివేకానందరెడ్డి ఇంటి వాచ్మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలాలు పరిశీలిస్తే సునీల్ యాదవ్ ప్రమేయం ఉందనే విషయం తెలుస్తుందన్నారు.వివేకానందరెడ్డి హత్య తరవాత గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి పారిపోవడాన్ని చూసిన రంగన్న అదే విషయాన్ని వాంగ్మూలంలో చెప్పాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హత్యకు ముందు తరవాత నిందితులు మాట్లాడిన కాల్ రికార్డులు కూడా ఉన్నాయని సీవీఐ కోర్టుకు తెలిపింది. వీరికి బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు