ఓటుకు నోటు కేసు విచారణ
సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. జూలై చివరి వారానికి వాయిదా వేస్తున్నట్లు
సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు
బదిలీ చేయాలనే పిటిషన్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ
ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు.
గత విచారణ సందర్భంగా ప్రతివాదులగా ఉన్న
రేవంత్ రెడ్డి,
తెలంగాణ ప్రభుత్వం, ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని అత్యున్నత
న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు
బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ కేసు
విచారణ తెలంగాణలో కాకుండా మధ్యప్రదేశ్‌లో జరిగేలా బదిలీ చేయాలపి ఈ ఏడాది జనవరి 31న బీఆర్ఎస్ నేతలు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహ్మద్ అలీ, కల్వకుంట్ల సంజయ్‌లు పిటిషన్ దాఖలు
చేశారు.
దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా
మధ్యప్రదేశ్ కు మాత్రమే కేసును ఎందుకు బదిలీ చేయాలని కోరుతున్నారని పిటిషనర్ల
తరుఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.