యునైటెడ్
అరబ్ ఎమిరేట్స్ (UAE)ను మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తాయి.
వానల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. గత నెలలో దుబాయ్‌ను
వణికించిన వానలు మళ్ళీ బెంబేలెత్తించాయి. దుబాయ్, అబుదాబీ సహా పలు నగరాల్లో గురువారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా
రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దుబాయ్
అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా
నడుస్తున్నాయి. శుక్రవారం కూడా వర్షాలు పడే అవకాశముంది. మే 5 వరకు విమానాలు
ఆలస్యంగా నడవటం లేదా రద్దయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 14-15 తేదీల్లోనూ యూఈఏని భారీవర్షాలు ముంచెత్తాయి. దీంతో జనజీవనం
స్తంభించింది.