Jaggayyapeta
Assembly Constituency Profile
ఎన్‌టిఆర్ జిల్లాలోని ఆఖరి శాసనసభా నియోజకవర్గం
జగ్గయ్యపేట. ఆ స్థానం 1951లో ఏర్పడింది. జగ్గయ్యపేట అసెంబ్లీ సీటు పరిధిలో నాలుగు
మండలాలు ఉన్నాయి. అవి వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, నందిగామ మండలంలో
కొంతభాగం.
జగ్గయ్యపేట అసెంబ్లీ స్థానంలో 1952లో సిపిఐ
గెలిచింది. 1962, 1967, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా 1972, 1983 ఎన్నికల్లో
స్వతంత్ర అభ్యర్ధులు ఉనికి చాటుకున్నారు. 1985, 1989, 1994 ఎన్నికల్లో తెలుగుదేశం
అభ్యర్ధి నెట్టెం రఘురాం హ్యాట్రిక్ సాధించారు. 1999, 2004లో కాంగ్రెస్ నుంచి
సామినేని ఉదయభాను గెలుపొందారు. శ్రీరాం రాజగోపాల్ తెలుగుదేశం అభ్యర్ధిగా సామినేని
ఉదయభానును 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైఎస్ఆర్‌సిపి నుంచి ఓడించారు. 2019లో వైసీపీ
అభ్యర్ధిగా సామినేని ఉదయభాను తెలుగుదేశం అభ్యర్ధి శ్రీరాం రాజగోపాల్‌ను ఓడించి
ప్రతీకారం తీర్చుకున్నారు.
ఇప్పుడు 2024లో వారిద్దరూ మరోసారి
పోటీపడుతున్నారు. అధికార వైఎస్ఆర్‌సిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని
ఉదయభాను, ప్రతిపక్ష తెలుగుదేశం నుంచి ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధిగా శ్రీరాం రాజగోపాల్
తలపడుతున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కర్నాటి అప్పారావు బరిలోకి
దిగారు.