Nandigama
Assembly Constituency Profile
ఎన్టిఆర్ జిల్లాలోని
రెండో ఎస్సీ నియోజకవర్గం నందిగామ. ఆ అసెంబ్లీ సీటు 1955లో ఏర్పడింది. నందిగామ
స్థానం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి కంచికచర్ల, చందర్లపాడు, వీరుళ్ళపాడు,
నందిగామ మండలంలో కొంతభాగం.
నందిగామలో 1955, 1962
ఎన్నికల్లో సిపిఐ గెలిచింది. 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1978లో
జనతా పార్టీ ఉనికి చాటుకుంది. 1983 నుంచి తెలుగుదేశం జైత్రయాత్ర మొదలైంది. 1983,
1985, 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లోనూ, 2014 ఉపయెన్నికలోనూ వరుసగా
తెలుగుదేశం విజయపరంపర కొనసాగింది. మధ్యలో ఒక్క 1989లో కాంగ్రెస్ గెలిచింది.
2014లో వైఎస్ఆర్సిపి తరఫున
పోటీ చేసి ఓడిపోయిన మొండితోక జగన్మోహనరావు, 2019లో టిడిపి అభ్యర్ధి తంగిరాల సౌమ్య
మీద గెలుపు దక్కించుకున్నారు. ఇప్పుడు 2024లో మళ్ళీ వాళ్ళిద్దరే తలపడుతున్నారు.
అధికార వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ కేటాయించింది. ప్రతిపక్ష
తెలుగుదేశం తమ ఎన్డిఎ కూటమి అభ్యర్ధిగా తంగిరాల సౌమ్యను తమ పార్టీ తరఫున మళ్ళీ
నిలబెట్టింది. ఇక ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మండ వజ్రయ్య పోటీలో
ఉన్నారు.