Mylavaram
Assembly Constituency Profile
ఎన్టిఆర్ జిల్లాలోని
మైలవరం శాసనసభా నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఆ నియోజకవర్గంలో ఐదు మండలాలు
ఉన్నాయి. అవి ఇబ్రహీంపట్నం, జి కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, విజయవాడ గ్రామీణ మండలంలో
కొంత భాగం.
మైలవరం నియోజకవర్గంలో
1955, 1962 ఎన్నికల్లో సిపిఐ గెలుపొందింది. 1967, 1972, 1978, 1985, 1989
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1983లో గెలిచిన తెలుగుదేశం మళ్ళీ
1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించింది. 2004లో కాంగ్రెస్ ఉనికి చాటుకున్నా మళ్ళీ
2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశమే అధికారంలోకి వచ్చింది. ఆ రెండుసార్లూ టిడిపి
తరఫున దేవినేని ఉమామహేశ్వరరావు వరుసగా కాంగ్రెస్, వైఎస్ఆర్సిపిల అభ్యర్ధులను
ఓడించారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి వసంత వెంకట కృష్ణప్రసాద్ టిడిపి అభ్యర్ధి
దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయం సాధించారు.
2024లో వైఎస్ఆర్సిపి
సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను మోహరించింది. వైసీపీ టికెట్ దక్కని వసంత వెంకట
కృష్ణప్రసాద్ టీడీపీలో చేరి ఆ పార్టీ తరఫున ఎన్‌డిఎ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి బొర్ర కిరణ్ పోటీపడుతున్నారు.