బీజేపీ
ప్రభంజనంలో కాంగ్రెస్ కంచుకోటలుగా పేరున్న నియోజకవర్గాలు
ఒక్కొక్కటిగా ఆ పార్టీ ‘చేయి’ జారుతున్నాయి. దశాబ్దాలుగా గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తన్న
అమేథీ నియోజకవర్గంలో గాంధీ కుటుంబం బంధం ఈ ఎన్నికలతో ముగిసింది.
2019
ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి
చెందిన రాహుల్ ఈసారి అక్కడ పోటీ చేయడం లేదు. ఆయనే కాదు ఆయన రక్తసంబంధీకులు
ఎవరూ కూడా ఆ స్థానం నుంచి బరిలో నిలవడం
లేదు.
కొన్ని దఫాలుగా రాయబరేలీ నుంచి లోక్‌సభకు
ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ, ఈసారి రాజ్యసభకు వెళ్ళారు. ఆమె ప్రత్యక్ష
ఎన్నికలకు దాదాపు దూరమయ్యారు.
దీంతో
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీనే రాయబరేలీ నుంచి పోటీకి దిగుతున్నారు.
అది కూడా ఆఖరి నిమిషంలో ఆ పార్టీ హైకమాండ్ రాహుల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది.
రకరకాలు వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలుకే మోసం వస్తుందని గ్రహించిన
కాంగ్రెస్ పెద్దలు రాహుల్ పేరు ప్రకటించారు.
ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్
వాద్రా పోటీ చేస్తారనే ప్రచారం
జరిగినప్పటికీ ఆఖరికి రాహుల్ నే పోటీకి సిద్ధమయ్యారు.
కేరళ
లోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్, రాయబరేలీ నుంచి హస్తం గుర్తుపై బరిలో
ఉంటున్నారు.
అమేథీ
నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్ శర్మ పోటీలో ఉండనున్నారు. రాయబరేలీ,
అమేథీ స్థానాలకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.
రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్
సింగ్ పోటీలో ఉన్నారు. 2014, 2019 లోక్‌సభ
ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోటీ చేసి ఓడారు.