వారం రోజులుగా శంషాబాద్ విమానాశ్రయ సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. అటవీశాఖ అధికారులు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌లో చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయ పరిధిలో ఐదు ప్రాంతాల్లో మేకలతో కూడిన బోన్లను ఏర్పాటు చేశారు. 20 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనించారు. మూడు రోజుల కిందట బోను దాకా వచ్చి వెనక్కు వెళ్లిన చిరుత ఎట్టకేలకు గురువారం రాత్రి బోనులో చిక్కింది.
చిరుతకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన, అమ్రాబాద్ రిజర్వు ఫారెస్టులో వదులుతామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. చిరుత చిక్కడంతో శంషాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు