సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళుతున్నాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 453 పాయింట్లు పెరిగి, 75వేల మార్క్‌ను దాటింది. నిఫ్టీ 135 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 22783 వద్ద ట్రేడవుతోంది. రూపాయి స్వల్పంగా బలహీనపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.83.40 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎల్ అండ్ టీ, టెక్ మహింద్రా, ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో నడుస్తున్నాయి.
ఆసియా మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం, ముడిచమురు ధరలు స్థిరంగా ఉండటంతో విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.