ఎన్నికల తర్వాత సంక్షేమ పథకాలు
అందజేస్తామంటూ ఓటర్లు పేర్లు నమోదు చేయడాన్ని రాజకీయ పార్టీలు తక్షణమే
నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రకటనలు, సర్వేలు, యాప్ ద్వారా ఓటర్ల
నమోదుకు సంబంధించిన కార్యకలాపాలను ఆపివేయాలని రాజకీయ పార్టీలను ఈసీ కోరింది.
ఎన్నికల అనంతర ప్రయోజనాల వాగ్దానాన్ని
ప్రోత్సహిస్తే ఓటర్లు, హామీ
ఇచ్చిన వారి మధ్య ఇచ్చిపుచ్చుకునే అవగాహన ఏర్పడుతుందని
ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది.
సాధారణ
ఎన్నికల వాగ్దానాలకు అనుమతి ఉనప్పటికీ.. పథకాల ఆశచూపి సర్వేలలో ఓటర్ల పేర్లు నమోదు
చేసుకుంటే నిజమైన సర్వేలు, రాజకీయ
లబ్ధి చేకూర్చే పక్షపాత ప్రయత్నాల మధ్య వ్యత్యాసం అస్పష్టంగా మారుతుందని ఎన్నికల
సంఘం తెలిపింది.
ఈ సమస్యను అధిగమించేందుకు అన్ని
జిల్లా ఎన్నికల అధికారులకు నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించామని
ఎన్నికల సంఘం వివరించింది.