ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 4.14 కోట్ల మంది ఓటు హక్కు వివియోగించుకోనున్నారని ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. తుది ఓటర్ల జాబితాలో 5.94 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు అక్రమ నగదు రూ. 203 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, సీజ్లకు సంబంధించి 9 వేల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మొత్తంగా 7,28,484 మంది హోం ఓటర్లు ఉండగా కేవలం 3 శాతం మాత్రమే హోం ఓటింగ్ ఆప్షన్ ఎంచుకున్నట్లు సీఈవో తెలిపారు.
సీ విజిల్ యాప్ ద్వారా 16,345 ఫిర్యాదులు అందగా డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు అందాయన్నారు. ఇందులో 10,403 ఫిర్యాదులు కచ్చితమైనవిగా నిర్ధారణ కావడంతో పరిష్కరించామన్నారు.