ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా పేరున్న మొయిన్‌పురిలో బీజేపీ
బుల్డోజర్లతో ర్యాలీ నిర్వహించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు సాగిన రోడ్ షోలో
యోగి పాలనలో మార్కుగా నిలిచిన బుల్డోజర్లపై బీజేపీ కార్యకర్తలు నిల్చుని నినాదాలు
చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ స్వస్థలమైన మెయిన్‌పురిలో బీజేపీ అభ్యర్థి
జైవీర్ సింగ్‌కు మద్దతుగా ఈ ర్యాలీ జరిగింది. సుమారు పద్నాలుగు బుల్డోజర్ల తో
బీజేపీ కార్యకర్తలు ర్యాలీ తీశారు.
ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్
భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి సైకిల్ గుర్తుపై పోటీలో
ఉన్నారు.
ములాయం సింగ్ యాదవ్ మరణం
నేపథ్యంలో రెండేళ్ళ కిందట జరిగిన ఉప ఎన్నికల్లో సుమారు 3 లక్షల మెజార్టీతో బీజేపీ పై డింపుల్ యాదవ్
విజయం సాధించారు. .
1996 నుంచి మెయిన్‌పురి లో ఎస్పీ నే గెలుస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్‌పురి జిల్లాలోని
నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండింటిని బీజేపీ కైవసం చేసుకుంది.