అశ్లీల వీడియోల రగడ కారణంగా కన్నడ
రాజకీయాల్లో పెనుదుమారం రేగింది. అశ్లీల వీడియోల రగడపై కేసు నమోదు చేసి దర్యాప్తు
చేపట్టిన సిట్, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ లకు సమన్లు జారీ చేసింది. దేశం
విడిచి వెళ్ళిన ప్రజ్వల్, విచారణకు హాజరయ్యేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు.
అందుకు నిరాకరించిన సిట్, ప్రజ్వల్ పై లుకౌట్ నోటీసు జారీ చేసింది.
హాసన నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీగా
ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ.. ఈ కేసు వెలుగులోకి రాగానే దేశం విడిచి వెళ్లిపోయారు.
ఈ
కేసు గురించి తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన రేవణ్ణ, విచారణకు
హాజరయ్యేందుకు వారం రోజులు గడువు ఇస్తే వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు.
ఎన్డీయే కూటమి అభ్యర్థిగా హాసన నుంచి
పోటీ లో ఉన్న ప్రజ్వల్ కు సంబంధించినవిగా
ఉన్న కొన్ని అభ్యంతరకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసు దర్యాప్తు కోసం
కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు