ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్
పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో రెండు
రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండేవారని ఎద్దేవా చేశారు. గుజరాత్‌లోని
ఆనంద్ లో ప్రచారంలో పాల్గొన్న మోదీ, గత 60 ఏళ్ళుగా
బ్యాంకులను కాంగ్రెస్ కబ్జా చేసిందన్నారు.
కశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని అమలు
చేయడానికి కాంగ్రెస్ నిరాకరించిందన్న
మోదీ, ఆర్టికల్ 370 గోడలా కూర్చుందన్నారు. సర్దార్ పుట్టిన నేల
నుంచి వచ్చిన తాను ఆర్టికల్ 370ని రద్దు చేశానని చెప్పారు. కశ్మీర్‌లో
త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి, భారత రాజ్యాంగాన్ని అమలు చేశామని
గుర్తు చేశారు.
ఒకప్పుడు ఉగ్రవాదులను ఎగుమతి చేసిన
దేశం (పాకిస్తాన్) ఇప్పుడు పిండిని దిగుమతి చేసుకోవడానికి నానా అగచాట్లు పడుతుందని
ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని
టార్గెట్ చేసిన ప్రధాని.. భారతదేశంలో కాంగ్రెస్ బలహీనపడుతోందన్నారు. భారత్ లో కాంగ్రెస్ చచ్చిపోతోందని.. అక్కడ పాకిస్తాన్
ఏడుస్తోందని సెటైర్లు వేశారు. యువరాజు (రాహుల్ గాంధీ)ను ప్రధానిని
చేసేందుకు పాక్ ఉవ్విళ్లూరుతోందన్నారు.