Machilipatnam
Parliamentary Constituency Profile
కృష్ణా జిల్లాలోని లోక్‌సభా నియోజకవర్గం
మచిలీపట్నం అలియాస్ బందరు. ఈ పార్లమెంటు స్థానం 1952లో ఏర్పడింది. మచిలీపట్నం ఎంపీ
సీటులో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి గన్నవరం, గుడివాడ, పెడన,
మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు.
మచిలీపట్నం ఎంపీ స్థానంలో 1952లో సిపిఐ
గెలిచింది, 1962లో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1957, 1967, 1971, 1977, 1980,
1984, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించింది. 1991లో తెలుగుదేశం
పార్టీ ఈ స్థానంలో గెలిచింది, 1996లో కూడా అదే విజయాన్ని పునరావృతం చేసింది.
1998లో కాంగ్రెస్, 1999లో టిడిపి గెలిచాయి. 2004లో కాంగ్రెస్ మళ్ళీ గెలిచింది. టిడిపి
అభ్యర్ధి కొనకళ్ళ నారాయణరావు 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి బడిగ రాధాకృష్ణను, 2014లో
వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి కొలుసు పార్థసారధిని ఓడించారు.
2019లో వైఎస్ఆర్‌సిపి తరఫున వల్లభనేని బాలశౌరినీ,
తెలుగుదేశం తరఫున కొనకళ్ళ నారాయణరావునూ పోటీ చేయిస్తే బాలశౌరి గెలిచారు.
ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిని
మార్చింది. సింహాద్రి చంద్రశేఖరరావును నిలబెట్టింది.
ప్రతిపక్ష ఎన్‌డిఎ కూటమి, జనసేన పార్టీ తరఫున చంద్రశేఖర్‌కు, తెలుగుదేశం పార్టీ సీటు
ఇప్పించింది. అటు ఇండీకూటమి తమ అభ్యర్ధిగా గొల్లు కృష్ణను ఎంచుకుంది.