Penamaluru
Assembly Constituency Profile
కృష్ణా జిల్లాలోని పెనమలూరు
నియోజకవర్గం 2008లో ఏర్పడింది. అంతకుముందు ఉయ్యూరు శాసనసభా స్థానం ఉండేది. పెడన అసెంబ్లీ
సీటు పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు.
ప్రముఖ స్వాతంత్ర్య
సమరయోధుడు కాకాని వెంకటరత్నం ఉయ్యూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి
1955, 1962, 1972 ఎన్నికల్లో గెలిచారు. 1967లోనూ, 1974 ఉపయెన్నికలోనూ స్వతంత్ర
అభ్యర్ధులు గెలుపొందారు. 1978లో జనతా పార్టీ నుంచి వడ్డే శోభనాద్రీశ్వరరావు విజయం
దక్కించుకున్నారు. 1983లోనూ, 1989లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు సొంతం చేసుకుంది. 1985,
1994, 1999 ఎన్నికలతో పాటు 2001 ఉపయెన్నికలోనూ తెలుగుదేశం గెలిచింది. 2004లో
కాంగ్రెస్ అభ్యర్ధి కొలుసు పార్థసారధి విజయం సాధించారు.
2009లో ఉయ్యూరు స్థానం
రద్దయిపోయి పెనమలూరు నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఆ ఏడాది ఎన్నికల్లో కూడా
కాంగ్రెస్ అభ్యర్ధి కొలుసు పార్థసారధి టిడిపి అభ్యర్ధిపై విజయం సాధించారు. 2014లో
టిడిపి అభ్యర్ధి బోడే ప్రసాద్ వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి కుక్కల విద్యాసాగర్‌ను
ఓడించారు. ఆ తర్వాత ఎన్నికల నాటికి కొలుసు పార్థసారధి వైఎస్ఆర్‌సిపిలో చేరారు. 2019లో
వైసీపీ తరఫున పోటీ చేసి, టిడిపి అభ్యర్ధి బోడే ప్రసాద్‌పై గెలిచారు.
ఇప్పుడు 2024లో
ఆశ్చర్యకరంగా అధికార పక్షం తమ సిటింగ్ ఎమ్మెల్యేను మార్చింది. కొలుసు పార్థసారధికి
సెలవిచ్చి జోగి రమేష్‌ను పెడన నుంచి ఇక్కడికి, పెనమలూరుకు తీసుకొచ్చింది. అటు
తెలుగుదేశం మాత్రం ఎన్‌డిఎ కూటమి తరఫున తమ అభ్యర్ధిగా బోడె ప్రసాద్‌ను
నిలబెట్టింది. ఇక్కడ ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా యెలిసాల సుబ్రహ్మణ్యం
బరిలో ఉన్నారు.