Pamarru Assembly
Constituency Profile
కృష్ణా జిల్లాలోని ఒకేఒక
ఎస్సీ నియోజకవర్గం పామర్రు. పామర్రుకు ముందు నిడుమోలు శాసనసభా నియోజకవర్గం ఉండేది.
పామర్రు అసెంబ్లీ స్థానం 2008లో ఏర్పడింది. పామర్రు సెగ్మెంట్లో ఐదు మండలాలు
ఉన్నాయి. అవి పామర్రు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, మొవ్వ, పెదపారుపూడి.
నిడుమోలు నియోజకవర్గంలో కమ్యూనిస్టుల
ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. 1962 ఎన్నికల్లో సిపిఐ గెలిచింది. 1967, 1972
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1978 ఎన్నికల్లో, 1979 ఉపయెన్నికలో సిపిఎం
గెలిచింది. 1983లో తెలుగుదేశానికి ఒక అవకాశం ఇచ్చారు. తర్వాత 1985, 1989, 1994,
2004 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సిపిఎం అభ్యర్ధులే గెలిచారు. మధ్యలో 1999లో
ఒకసారి తెలుగుదేశం గెలిచింది.
2008లో పామర్రు ఎస్సీ
నియోజకవర్గం ఏర్పడ్డాక 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది,
తెలుగుదేశం అభ్యర్ధిగా ఉన్న ఉప్పులేటి కల్పన ఆ తర్వాత వైసీపీలో చేరింది. రాష్ట్ర
విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి ఉప్పులేటి కల్పన
తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వర్ల రామయ్యపై విజయం సాధించింది. అయితే కొద్దికాలానికే
ఆమె మళ్ళీ తెలుగుదేశంలో చేరిపోయింది. 2019
ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి కైలే అనిల్ కుమార్ సమీప ప్రత్యర్ధి, తెలుగుదేశం
అభ్యర్ధి అయిన కల్పనను ఓడించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ను మళ్ళీ బరిలోకి దింపింది.
ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమారరాజా పోటీ
చేస్తున్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా డివై దాస్ రంగంలో నిలిచారు.