Avanigadda
Assembly Constituency Profile
మర్యాదస్తుడైన,
సాహిత్యాభిమాని అయిన విద్యావేత్తగా మండలి బుద్ధప్రసాద్‌కు మంచిపేరుంది. ఈసారి ఆయన
ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధిగా తెలుగుదేశం నుంచి కాక జనసేన పార్టీ అభ్యర్ధిగా అవనిగడ్డ
శాసనసభా నియోజకవర్గంలో నిలబడ్డారు.
అవనిగడ్డ అసెంబ్లీ
స్థానం 1962లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలు ఉన్నాయి. అవి
అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల.
అవనిగడ్డ స్థానంలో 1962,
1967 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి వై శివరామప్రసాద్ విజయం సాధించారు. తర్వాత
1972, 1978, 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మండలి వెంకట కృష్ణారావు గెలుపొందారు.
ఆపైన 1985, 1989, 1994 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి సింహాద్రి సత్యనారాయణరావు గెలుపు
దక్కించుకున్నారు. 1999, 2004లో మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం
సాధించారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి అంబటి బ్రాహ్మణయ్య గెలిచారు. ఆయన
మరణంతో 2013లో జరిగిన ఉపయెన్నికల్లో ఆయన కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్, ఇతర
ప్రధాన పార్టీలు పోటీ చేయకపోవడంతో గెలిచారు.
2014లో మండలి
బుద్ధప్రసాద్ తెలుగుదేశం తరఫున పోటీ చేసి వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి సింహాద్రి రమేష్
బాబు మీద విజయం సాధించారు. 2019లో మళ్ళీ వాళ్ళిద్దరే పోటీపడ్డారు. ఆ పోటీలో వైసీపీ
నుంచి సింహాద్రి రమేష్ బాబు గెలిచారు.
ఇక 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి
తమ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబునే మళ్ళీ బరిలో దింపింది. ఎన్‌డిఎ
కూటమి పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించారు. అయితే బుద్ధప్రసాద్
తెలుగుదేశం నుంచి జనసేనలోకి వెళ్ళి ఆ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ ఇండీ
కూటమి అభ్యర్ధిగా అందె శ్రీరామమూర్తి నిలబడ్డారు.