Machilipatnam
Assembly Constituency Profile
బందరు అని పిలవబడే మచిలీపట్నం
కృష్ణాజిల్లాలోని సాగరతీర నగరం, జిల్లా కేంద్రం కూడా. మచిలీపట్నం మండలం మొత్తం
కలిపి మచిలీపట్నం శాసనసభా స్థానంగా కూడా ఉంది. ఆ నియోజకవర్గం 1951లో ఏర్పడింది.
ఈ నియోజకవర్గంలో 1952లో
జరిగిన ఎన్నికల్లో సిపిఐ గెలిచింది. 1955, 1959, 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్
పార్టీ విజయం సాధించింది. 1962లో స్వతంత్ర అభ్యర్ధి గెలవగా 1978లో జనతా పార్టీ
గెలిచింది. 1983, 1985 ఎన్నికల్లో కొత్త పార్టీ తెలుగుదేశం తన ప్రాభవం చూపించింది.
1989లో కాంగ్రెస్ నుంచి పేర్ని కృష్ణమూర్తి గెలిచినా 1994, 1999 ఎన్నికల్లో మళ్ళీ
సైకిల్ జోరు పెరిగింది. 2004, 2009 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ నుంచి పేర్ని
వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని విజయం సాధించారు.
రాష్ట్ర విభజన తర్వాత
జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి కొల్లు రవీంద్ర, వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి
పేర్ని నాని మీద గెలుపొందారు. 2019లో వైసీపీ అభ్యర్ధిగా పేర్ని నాని టీడీపీ అభ్యర్ధిగా
కొల్లు రవీంద్రపై గెలిచి బదులు తీర్చేసుకున్నారు.
ఇప్పుడు 2024లో పేర్ని
నాని తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టును తన రాజకీయ వారసుడిగా
ప్రవేశపెడుతున్నారు. ఎన్‌డిఎ కూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా కొల్లు రవీంద్ర
మరోసారి పోటీ పడుతున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి అబ్దుల్ మతీన్
తలపడుతున్నారు.