హిందూ వివాహం ఓ పవిత్రమైన
కార్యక్రమమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆటపాటల కార్యక్రమమో, విందు వినోదమో, వాణిజ్య లావాదేవీనో ఎంతమాత్రం కాదని స్పష్టం చేసింది.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్-
7
ప్రకారం
పెళ్ళిలో కచ్చితంగా సంప్రదాయాలు, ఆచారాలు, క్రతువులను
నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. సంబందిత ప్రక్రియలను పాటించకుండా జరిగిన
పెళ్ళిని రిజిస్టర్ చేసినా దానిని చట్టబద్ధంగా చెల్లదని ప్రకటించాల్సి వస్తుందని
వివరించింది.
హిందూ
ధర్మంలో పెళ్ళి అనేది ఓ సంస్కారమని భారతీయ సమాజంలో దానికి ఆ హోదా ఇవ్వాల్సిందేనని
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్
ఆగస్టీన్ జార్జి మాసిహ్ లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
సప్తపది
లాంటి సంప్రదాయ ఆచారాలను నిర్వహించకపోతే అది హిందూ వివాహం కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది.
హిందూ పద్ధతి
ప్రకారం వివాహం చేసుకోకుండానే ఒక్కటైన ఓ జంట విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది.
ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ
వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న అధికారాలను
వినియోగిస్తూ ఆ దంపతుల పెళ్లి చెల్లదని ఇటీవల తీర్పు వెలువరించింది.