తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం,భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ,భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఆధ్వర్యంలో విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనం ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సమ్మేళనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం రూపుదిద్దుకుంటుందన్నారు. వేదాలు విజ్ఞాన భాండాగారాలన్నారు.ఆధునిక మానవ సమాజం శాంతి సౌఖ్యాలతో జీవించడానికి వేదాలు, ఆధునిక శాస్త్రాలను మిళితం చేయాలన్నారు. వేదాల్లో ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం దాగి ఉందన్నారు.
శిల్ప కళాశాలలో కళంకారి డిప్లొమా కోర్సు ప్రవేశాలకు నోటిఫికేషన్...
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన విడుదలైంది. కళాశాలలో జూన్ 17వ తేదీ వరకు దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 17వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాలి.
4 సంవత్సరాల డిప్లొమా, 2 ఏళ్ళ సర్టిఫికెట్ కోర్సులో చేర దలచిన విద్యార్థులు కోర్సుల విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637, 9866997290 నంబరులో గానీ కార్యాలయ పనివేళల్లో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.