Amit Shah Campaign in Bhagyanagar
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి
కిషన్‌రెడ్డి, హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతలకు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్షా
బుధవారం రాత్రి నగరంలో రోడ్ షో నిర్వహించారు.
అమిత్ షా తొలుత లాల్ దర్వాజా మహంకాళి
ఆలయంలో పూజలు చేసారు. అక్కడినుంచి శాలిబండ సుధా టాకీస్ వరకు రోడ్ షో నిర్వహించారు.
ఆయన ప్రచార కార్యక్రమంలో జనం అడుగడుగునా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. చాలామంది
స్త్రీలు బోనాలతో ఎదురొచ్చిస్వాగతం పలికారు. అమిత్ షా రోడ్ షో
సందర్భంగా రాజధాని రహదారులన్నీ కాషాయరంగు పులుముకున్నాయి.
సికింద్రాబాద్, హైదరాబాద్
బీజేపీ అభ్యర్థులు జి కిషన్ రెడ్డి, కె మాధవీ లతలకు మద్దతుగా అమిత్ షా చేపట్టిన
రోడ్ షో విజయవంతమైంది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ అమిత్ షా ముందుకు
కదిలారు. నాలుగు దశాబ్దాల రజాకార్ల పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు
పిలుపునిచ్చారు. రజాకార్ల గుప్పిట్లో చిక్కుకుపోయిన హైదరాబాద్కు విముక్తి
కలగాలంటే బీజేపీకే ఓటు వేయాలని ఆయన కోరారు.
ప్రచార సమయం తక్కువ ఉండడంతో అమిత్షా
కేవలం 5 నిమిషాలే ప్రసంగించారు. రోడ్ షో పూర్తయాక అమిత్ షా నేరుగా నాంపల్లిలోని
పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ చేవెళ్ళ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్నియోజకవర్గాల
ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. మోదీ ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి పనుల
గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.
కేంద్రం సాహసోపేత నిర్ణయాలు, తెలంగాణకు చేసిన
సహాయాన్ని ప్రజలకు వివరించాలని, కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాల్సిన
ఆవశ్యకతను ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలనీ ఆయన మార్గనిర్దేశం చేశారు.