Nuzividu
Assembly Constituency Profile
ఏలూరు జిల్లాలోని నూజివీడు
శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ స్థానం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి.
అవి అగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు.
నూజివీడు జిల్లాలో మేకా
కుటుంబం రాజకీయ కుటుంబంగా చెప్పుకోవచ్చు. మేకా రంగయ్య అప్పారావు కాంగ్రెస్ తరఫున
1952, 1955, 1962, 1967, 1972 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. 1978లో కాంగ్రెస్
తరఫున పాలడుగు వెంకట్రావు గెలిచారు. కోటగిరి హనుమంతరావు 1983లో స్వతంత్ర
అభ్యర్ధిగానూ, 1985లో టిడిపి అభ్యర్ధిగానూ విజయం కైవసం చేసుకున్నారు. 1989లో మళ్ళీ
కాంగ్రెస్ నుంచి పాలడుగు వెంకట్రావు గెలుపు దక్కించుకోగలిగారు. 2004లో మళ్ళీ మేకా
వంశం నుంచి వెంకట ప్రతాప అప్పారావు రంగప్రవేశం చేసారు, కాంగ్రెస్‌కు విజయం తెచ్చిపెట్టారు.
2009లో తెలుగుదేశం గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో మేకా వెంకట ప్రతాప అప్పారావు
వైఎస్ఆర్‌సిపి తరఫున పోటీ చేసి విజయాలు సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేకా వెంకట ప్రతాప అప్పారావు బరిలో
నిలిచారు. అదే పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన కొలుసు పార్థసారధి టిడిపి
టికెట్ మీద ఎన్‌డిఎ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా మరీదు కృష్ణ నిలబడ్డారు.