Chintalapudi
Assembly Constituency Profile
ఏలూరు జిల్లాలోని ఒకే ఒక
ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి. ఆ అసెంబ్లీ స్థానం 1951లో ఏర్పడింది. చింతలపూడి సీటు
పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి చింతలపూడి, లింగపాలెం, కామవరపు కోట,
జంగారెడ్డిగూడెం.
చింతలపూడి శాసనసభా
నియోజకవర్గంలో 1952లో సిపిఐ విజయం సాధించింది. తర్వాత 1962, 1967, 1978 ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1972లో మాత్రం స్వతంత్ర అభ్యర్ధి గెలుపు
దక్కించుకున్నారు. 1983లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన కోటగిరి
విద్యాధరరావు 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధిగా గెలిచి వరుసగా
ఐదుసార్లు నియోజకవర్గంపై తన జెండా పాతారు. 2004, 2009లో కాంగ్రెస్ విజయం
సాధించింది.
2014లో తెలుగుదేశం
అభ్యర్ధి పీతల సుజాత వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి బుర్ల దేవీప్రియ మీద గెలిచారు.
2019లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి వున్నమట్ల ఎలీజా టిడిపి అభ్యర్ధి కర్రా రాజారావును
ఓడించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి కంభం విజయరాజును నిలబెట్టింది. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం
అభ్యర్ధిగా సొంగ రోషన్ పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ నుంచి
వున్నమట్ల ఎలీజా బరిలో నిలిచారు.