Polavaram
Assembly Constituency Profile
ఏలూరు జిల్లాలోని ఒకే ఒక
ఎస్టీ నియోజకవర్గం పోలవరం. 1955లో ఏర్పడిన ఆ నియోజకవర్గం పరిధిలో ఏడు మండలాలు
ఉన్నాయి. అవి పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, టి.నరసాపురం,
కుక్కునూరు, వీరులపాడు.
పోలవరం నియోజకవర్గంలో
1955 నుంచి 1978 వరకూ కాంగ్రెస్ పార్టీయే విజయాలు సాధించింది. మధ్యలో 1962లో
ఒకసారి సిపిఐ గెలిచింది. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా 1987, 1989
ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది. 1994, 1999 ఎన్నికల్లో సైకిల్ జోరు
కొనసాగింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తెల్లం బాలరాజు విజయం
సాధించారు. 2012లో ఆయన వైఎస్ఆర్‌సిపి టికెట్ మీద పోటీ చేసి గెలిచారు.
2014 ఎన్నికల్లో
తెలుగుదేశం అభ్యర్ధి మొడియం శ్రీనివాసరావు వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి తెల్లం బాలరాజు
మీద విజయం సాధించారు. 2019లో తెల్లం బాలరాజు వైఎస్ఆర్‌సిపి నుంచి పోటీ చేసి టిడిపి
అభ్యర్ధి బొరగం శ్రీనివాసరావును ఓడించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి నుంచి తెల్లం రాజలక్ష్మి బరిలోకి దిగారు. ఎన్‌డిఎ కూటమి నుంచి జనసేన
అభ్యర్ధి చిర్రి బాలరాజు పోటీ పడుతున్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ దువ్వెళ్ళ
సృజనను నిలబెట్టింది.