Eluru
Assembly Constituency Profile
ఏలూరు జిల్లాలోని ఏలూరు
శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ స్థానం పరిధిలో రెండు మండలాలు ఉన్నాయి.
అవి ఏలూరు మండలం, యాభై వార్డులతో కూడిన ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్.
ఏలూరు నియోజకవర్గం
ఏర్పడిన కొత్తలో కమ్యూనిస్టుల ప్రాబల్యం బాగానే ఉండేది. 1952, 1962 ఎన్నికల్లో
సిపిఐ గెలిచింది. 1972లో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1955, 1967, 1978 ఎన్నికల్లో
కాంగ్రెస్ విజయం సాధించింది. 1983, 1985 ఎన్నికల్లో కొత్త పార్టీ తెలుగుదేశం
విజయపతాకం ఎగురవేసింది. 1989లో మళ్ళీ కాంగ్రెస్ ఉనికి నిలబెట్టుకుంది. కానీ 1994,
1999 ఎన్నికల్లో టిడిపి గెలుపు దక్కించుకుంది. 2004, 2009 ఎన్నికల్లో మళ్ళీ
కాంగ్రెస్ ప్రాభవం చాటుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత
జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ సోదిలోకి లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ
బడేటి కోట రామారావు (బడేటి బుజ్జి) వైఎస్ఆర్సిపి ప్రత్యర్థి ఆళ్ళ కాళీకృష్ణ
శ్రీనివాస్ (ఆళ్ళ నాని) మీద గెలుపొందారు. 2019లో పరిస్థితి తారుమారయింది. వైసీపీ
తరఫున ఆళ్ళ నాని తెలుగుదేశం అభ్యర్ధి బడేటి బుజ్జి మీద విజయం సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ నానిని రంగంలోకి దించింది. ఎన్డిఎ
కూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా బడేటి రాధాకృష్ణ నిలబడ్డారు. ఇండీ కూటమి తరఫున సిపిఐ
అభ్యర్ధిగా బండి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు.