బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులు
కేసు విచారణ ముమ్మరంగా జరుగుతోంది.
కాల్పులకు పాల్పడిన ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకరు కస్టడీలో ఆత్మహత్యకు
పాల్పడ్డాడు.
పోలీసు కస్టడీలో ఉన్న అనూజ్ తపన్(32) నిందితుడు బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు
పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన జైలు అధికారులు అతడిని హుటాహుటిన జీటీ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
గత నెల 14న ముంబైలోని సల్మాన్ ఖాన్ నివాసం అపార్టుమెంట్ దగ్గర
కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపిన
అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన
పోలీసులు, నిందితుల్ని గుజరాత్లో
అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్ తపన్, సోను సుభాశ్ చందర్‌ను కస్టడీలోకి తీసుకుని
ప్రశ్నిస్తున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు