Unguturu
Assembly Constituency Profile
ఏలూరు జిల్లాలోని
ఉంగుటూరు నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు
ఉన్నాయి. అవి ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం.
ఉంగుటూరులో 1967, 1972
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1983, 1985 ఎన్నికల్లో కొత్త
పార్టీ తెలుగుదేశం జెండా ఎగరేసింది. 1989లో కాంగ్రెస్ మళ్ళీ గెలిచినా ఆ ఊపు
నిలబెట్టుకోలేకపోయింది. 1994, 1999లో టిడిపి గెలుపు కైవసం చేసుకుంది. మళ్ళీ 2004,
2009లో కాంగ్రెస్ విజయం సాధించింది.
2014లో తెలుగుదేశం నుంచి
గన్ని వీరాంజనేయులు, వైఎస్ఆర్‌సిపి నుంచి పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు
పోటీ పడ్డారు. టిడిపి గెలిచింది. 2019లో మళ్ళీ వాళ్ళిద్దరే తలపడ్డారు. అప్పుడు
వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా వాసుబాబు విజయం సాధించారు. ఇప్పుడు 2024లో వైఎస్‌ఆర్‌సిపి
తమ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుబాబును అభ్యర్ధిగా కొనసాగించింది. ఎన్‌డిఎ కూటమి తరఫున
జనసేన పార్టీ అభ్యర్ధిగా పత్సమట్ల ధర్మరాజు పోటీ
చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పాతపాటి హరికుమారరాజు
బరిలో ఉన్నారు.